1. అమెజాన్‌లో నెల రోజుల పాటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగింది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే లభించాయి. సేల్ ముగిసిన తర్వాత కొన్ని మొబైల్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. ఆరు నెలల క్రితం సాంసంగ్ నుంచి రిలీజై పాపులర్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Samsung Galaxy M53 5G) స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ ధరలు చూస్తే ఈ మొబైల్ రూ.30,000 లోపు బడ్జెట్లో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499. ఈ మొబైల్ రూ.30,000 లోపు సెగ్మెంట్లో మిగతా బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. (image: Samsung India)
4. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి పలు ఆఫర్స్ కూడా ఉన్నాయి. రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. కాస్త తక్కువ వ్యాల్యూ ఉన్న మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసినా రూ.15,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత మొబైల్‌కు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ మొబైల్‌ను రూ.15,000 లోపే సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ ప్రైమరీ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం Sony IMX 616 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (image: Samsung India)