1. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ (Amazon Monsoon Carnival) సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వన్‌ప్లస్, షావోమీ, రెడ్మీ, సాంసంగ్ లాంటి బ్రాండ్ల మొబైల్స్‌ని ఆఫర్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్, అమెజాన్ ఆఫర్ కలిపి రూ.4,750 తగ్గింపు లభిస్తుంది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ గతేడాది రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్‌లో తక్కువ ధరకే లిస్ట్ అయింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. (image: Samsung India)
3. సిటీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో పాటు అమెజాన్ కూపన్ ఆఫర్ కూడా ఉంది. ఆఫర్స్ అన్నీ కలిపి సాంసంగ్ గెలాక్సీ ఎం32 బేస్ వేరియంట్‌ను రూ.10,249 ధరకే కొనొచ్చు. రూ.4,750 తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ జూన్ 12న ముగుస్తుంది. అప్పట్లోగా ఈ ఆఫర్ పొందొచ్చు. (image: Amazon India)
4. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాససెర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై53ఎస్, వివో వై33ఎస్, పోకో ఎం2, మైక్రోమ్యాక్స్ ఇన్ 1, రెడ్మీ 9 లాంటి మొబైల్స్‌లో ఉంది. ఈ మొబైల్స్ అన్ని రూ.15,000 లోపు లభిస్తున్నవే. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Samsung India)