1. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం సౌత్ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం అయిన సాంసంగ్ ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ (Samsung Galaxy A03 Core) మొబైల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నెలకు కేవలం రూ.376 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా ఈ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్ మోడల్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా మొదలైంది. సాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ పోర్టల్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
3. సాంసంగ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో 24 నెలల ఈఎంఐ ఆప్షన్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. 24 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.376 చొప్పున చెల్లించాలి. క్రెడిట్ కార్డులతో పాటు డెబిట్ కార్డులపైనా ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రధాన బ్యాంకులన్నీ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాయి. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఇన్ఫినిటీ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. Unisoc SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కేవలం 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ + సాంసంగ్ వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే యాప్స్ అన్నీ లైట్ వర్షన్లో ఉంటాయి. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ సైజ్ రెగ్యులర్ యాప్ సైజ్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సేఫ్ ఫోల్డర్ ఫీచర్ కూడా ఉంది. ఇక ఆండ్రాయిడ్ గో 10 యాప్స్ కన్నా ఆండ్రాయిడ్ గో 11 యాప్స్ 20 శాతం వేగంగా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
7. ఇటీవల బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇన్నాళ్లూ ఫీచర్ ఫోన్స్ వాడినవాళ్లు స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. దీంతో రూ.10,000 లోపు సెగ్మెంట్లోని స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోకో సీ31, రియల్మీ సీ21వై, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, రియల్మీ సీ25వై, రియల్మీ నార్జో 50ఏ, మోటోరోలా ఇ40 లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ రూ.10,000 లోపు బడ్జెట్లో బాగా సేల్ అవుతున్నాయి. (image: Samsung India)