1. షావోమీ ఇండియా రిలీజ్ చేసిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ (Mi 11X Pro 5G) మోడల్ భారీ డిస్కౌంట్‌కే లభిస్తోంది. మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale), దివాళీ విత్ మీ (Diwali With Mi) సేల్‌లో ఈ ఆఫర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
3. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.25,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో షావోమీ అందిస్తున్న రూ.9,000 డిస్కౌంట్ కూడా కలిపే ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.16,500 విలువ చేస్తే చాలు మీకు రూ.25,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Xiaomi India)
5. మీ పాత మొబైల్‌కు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తక్కువగా వస్తే మిగతా మొత్తం చెల్లించి ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.11,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వచ్చినా అదనంగా రూ.9,000 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మొత్తం రూ.20,000 తగ్గింపు లభిస్తుంది. రూ.39,999 విలువైన మొబైల్‌ను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
7. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ సాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (image: Xiaomi India)
8. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,520ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 2.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)