Lava Probuds: రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్ రూ.1 ధరకే సొంతం చేసుకోండి ఇలా
Lava Probuds: రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్ రూ.1 ధరకే సొంతం చేసుకోండి ఇలా
Lava Probuds | ఈమధ్య అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇయర్‌బడ్స్ లాంఛ్ చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన లావా మొబైల్స్ కూడా లావా ప్రోబడ్స్ లాంఛ్ చేసింది. రూ.2,199 విలువైన ఈ ఇయర్‌బడ్స్‌ని రూ.1 ధరకే అందిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1/ 15
1. మంచి బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ కొనాలంటే రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేయాలి. మీరు ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటే అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్‌ని కేవలం ఒక్క రూపాయికే సొంతం చేసుకోవచ్చు. (image: lavamobiles)
2/ 15
2. లావా ప్రోబడ్స్ లేటెస్ట్గా లాంఛ్ అయింది. ఇంకా సేల్ ప్రారంభం కాలేదు. లావా మొబైల్స్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1 ధరకే లావా ప్రోబడ్స్ అమ్మనుంది లావా మొబైల్స్. (image: lavamobiles)
3/ 15
3. జూన్ 24న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. లావా ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లావా ప్రోబడ్స్ కొనొచ్చు. (image: lavamobiles)
4/ 15
4. స్టాక్ ఉన్నంతవరకే ఈ ఆఫర్ వర్తిస్తుందని లావా మొబైల్స్ ప్రకటించింది. రూ.1 ధరకే కేటాయించిన స్టాక్ అమ్మిన తర్వాత ప్రోబడ్స్ ధర రూ.2,199 అవుతుంది. (image: lavamobiles)
5/ 15
5. ప్రోబడ్స్ ద్వారా వైర్లెస్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది లావా. విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని వీటిని లాంఛ్ చేసింది. ఇంటి నుంచే చదువుకుంటున్నవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి అవసరాలను ప్రోబడ్స్ తీరుస్తుందని లావా మొబైల్స్ ప్రకటించింది. (image: lavamobiles)
6/ 15
6. లావా ప్రోబడ్స్లో 11.6ఎంఎం అడ్వాన్స్డ్ డ్రైవర్స్ ఉంటాయి. మీడియాటెక్ ఎయిరోహా చిప్సెట్తో పనిచేస్తుంది. (image: lavamobiles)
7/ 15
7. లావా ప్రోబడ్స్లో ఒక బడ్లో 55ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 గంటల పాటు మ్యూజిక్ ప్లేటైమ్ వస్తుంది. 500ఎంఏహెచ్ కేస్ బ్యాటరీ ఉంటుంది. (image: lavamobiles)
8/ 15
8. లావా ప్రోబడ్స్లో 'వేక్ అండ్ పెయిర్' టెక్నాలజీ ఉంది. లేటెస్ట్ బ్లూటూత్ v5.0 వర్షన్‌తో లావా ప్రోబడ్స్ పనిచేస్తుంది. (image: lavamobiles)
9/ 15
9. లావా ప్రోబడ్స్ బరువు 77గ్రాములు. IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: lavamobiles)