1. వివో ఇండియా కొద్ది రోజుల క్రితం వివో వై33టీ (Vivo Y33T) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. అంతకన్నా ముందు రిలీజ్ చేసిన వివో వై21టీ (Vivo Y21T) మోడల్‌కు కొన్ని అదనపు ఫీచర్స్ కలిపి వివో వై33టీ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ జనవరి 31న ముగుస్తుంది. అప్పటివరకు ఈ ఆఫర్ పొందొచ్చు. (image: Vivo India)
2. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,990. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 పైనే డిస్కౌంట్ లభిస్తుంది.అయితే ఎక్స్ఛేంజ్లో మీ స్మార్ట్‌ఫోన్ రూ.15,850 విలువ చేస్తే వివో వై33టీ స్మార్ట్‌ఫోన్ మీకు తక్కువ ధరకు లభిస్తుంది. (image: Flipkart)
3. రూ.15,850 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,140 ధరకు సొంతం చేసుకోవచ్చు. మీ మొబైల్‌కు ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ తక్కువ వస్తే మిగతా మొత్తం చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.659 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. (image: Vivo India)
4. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ సెల్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్‌తో 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. (image: Vivo India)
5. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్యుమెంట్స్, 50 మెగాపిక్సెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Vivo India)
6. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్డే క్రీమ్, మిర్రర్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Vivo India)
7. వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్, వివో ఇండియా ఇ-స్టోర్, పేటీఎం, టాటా క్లిక్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఈ బడ్జెట్లో రెడ్మీ నోట్ 11టీ, మోటో జీ60, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ 8ఎస్, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లకు వివో వై33టీ గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Vivo India)