Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్ఛేంజ్ ఆఫర్ వివరాలివే
Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్ఛేంజ్ ఆఫర్ వివరాలివే
Realme 8 Exchange Offer | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1. రియల్మీ కొద్ది రోజుల క్రితం రియల్మీ 8 ప్రో, రియల్మీ 8 మోడల్స్‌ని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Realme India)
2/ 15
2. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.14,999 విలువైన రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. (image: Realme India)
3/ 15
3. రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అంటే మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.14,450 విలువ చేస్తే ఇక మీరు చెల్లించాల్సింది రూ.549 మాత్రమే. (image: Realme India)
4/ 15
4. అంటే రూ.14,999 రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ మీకు రూ.549 ధరకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Realme India)
5/ 15
5. ఇక రియల్మీ 8 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
6/ 15
6. రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Realme India)
7/ 15
7. రియల్మీ 8 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. (image: Realme India)
8/ 15
8. రియల్మీ 8 స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ సిల్వర్, సైబర్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999. (image: Realme India)