1. వన్‌ప్లస్ ఇటీవల ఇండియాలో నార్డ్ సిరీస్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ (OnePlus Nord 2T) మొబైల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో ప్రారంభమైంది. అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. (image: OnePlus India)
2. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 33,999. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2టీ బేస్ వేరియంట్‌ను రూ.27,499 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.32,499 ధరకు కొనొచ్చు. (image: OnePlus India)
3. అమెజాన్‌లో రూ.19,100 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. అంటే ఈ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.19,100 వరకు తగ్గింపు పొందొచ్చు. ఒకవేళ మీ పాత మొబైల్‌కు ఎక్స్ఛేంజ్లో రూ.15,000 డిస్కౌంట్ లభిస్తే మీరు మిగతా రూ.13,999 చెల్లించి బేస్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. మీ పాత మొబైల్‌కు అంతకన్నా తక్కువ డిస్కౌంట్ వస్తే మిగతా మొత్తం చెల్లించాలి. (image: OnePlus India)
4. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన మొదటి మొబైల్ ఇదే. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ కెమెరా వివరాలు చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఏఐ ఎన్‌హ్యాన్స్‌మెంట్, ఏఐ హైలైట్ వీడియో, స్లోమో, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్డీఆర్, నైట్స్కేప్, పోర్ట్రైట్ మోడ్, పనో, రీటచింగ్, ఫిల్టర్స్ ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX615 ఫ్రంట్ కెమెరా ఉంది. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 15నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక రోజంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, టైప్ సీ కేబుల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: OnePlus India)
7. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ ఆక్సిజన్ ఓఎస్ 12.1 + ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది. 5జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. (image: OnePlus India)