1. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రిలయన్స్ జియో (Reliance Jio) అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ 10 సిరీస్‌లో లాంఛ్ అయిన వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R) స్మార్ట్‌ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్ కొన్నవారికి రిలయన్స్ జియో నుంచి రూ.7,200 విలువైన బెనిఫిట్స్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తాయి. (image: OnePlus India)
3. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొన్న జియో కస్టమర్లకు రూ.150 విలువైన 48 డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి. వీటి మొత్తం విలువ రూ.7,200. కస్టమర్లు 2022 మే 9 తర్వాత వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ కొని, మొదటి రీఛార్జ్ చేసిన తర్వాత మైజియో యాప్‌లో డిస్కౌంట్ కూపన్స్ చూడొచ్చు. ఇండియన్ వర్షన్ వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌కే ఈ ఆఫర్ లభిస్తుంది. (image: Reliance Jio)
4. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ కావాలంటే కస్టమర్లు రూ.1,199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ పైనే వారికి రూ.150 డిస్కౌంట్ కూపన్ వర్తిస్తుంది. కస్టమర్లు 2023 డిసెంబర్ 31 వరకు 48 డిస్కౌంట్ కూపన్స్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం కూపన్స్ ఉపయోగించే కస్టమర్లకు రూ.7,200 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఇటీవల వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇండియాలో రిలీజైంది. వన్‌ప్లస్ 10ఆర్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.38,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఒకవేళ 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.43,999 చెల్లించాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: OnePlus India)
7. మూడు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: OnePlus India)
8. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు రకాల బ్యాటరీ కెపాసిటీలతో వేర్వేరు వేరియంట్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీకి 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, 4,500ఎంఏహెచ్ బ్యాటరీకి 150వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 150వాట్ సూపర్‌వూక్ ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే రోజంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించుకోవచ్చు. (image: OnePlus India)