1. వచ్చే వారమే భారతీయ అతి పెద్ద పండుగ దీపావళి రాబోతోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసి తమ జీవితాల్లో హ్యాపీనెస్ నింపుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఫోన్ కొనాలనుకునే వారు యాపిల్ ఐఫోన్స్ (iPhones) కూడా ఒకసారి చెక్ చేయవచ్చు. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎందుకంటే ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) ఐఫోన్ మోడల్స్‌పై ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఐఫోన్ 12 (iPhone 12)పై అమెజాన్ ఏకంగా రూ.32 వేల డిస్కౌంట్ ప్రకటించింది. దీన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇంతకుమించిన డీల్ మళ్లీ దొరకదని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక ఐఫోన్ మోడల్‌పై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. iPhone SE: ఈ ఏడాదిలోనే లాంచ్ అయిన ఐఫోన్ SE (3rd Gen) ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.47,990కి లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ రూ.16,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అప్పుడు ఐఫోన్ SE 3 ధర రూ. 31,090కి తగ్గుతుంది. ఐఫోన్ SE లేటెస్ట్ 2022 ఎడిషన్ 4.7-అంగుళాల రెటినా HD డిస్ప్లే, 12 MP బ్యాక్ కెమెరా, 7MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. శామ్సంగ్ లవర్స్ కోసం కూడా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయ డిస్కౌంట్స్ తీసుకొచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ F21 FE 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ.35,999కే దొరుకుతోంది. ఈ 5G ఫోన్ కొనేవారు గరిష్ఠంగా రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. iPhone 12 64GB: అమెజాన్ ప్రస్తుతం రూ.65,900 ధర ఉన్న ఐఫోన్ 12 64GB వేరియంట్‌ను 28 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.47,499కే విక్రయిస్తోంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు అమెజాన్‌లో రూ.12,200 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 12 ధర రూ.35,299కి తగ్గుతుంది. వినియోగదారులు అమెజాన్ ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించి రూ.1,000 వరకు తగ్గింపును కూడా అందుకోవచ్చు. అప్పుడు దీని ధర రూ.34,299 వరకు తగ్గుతుంది. అంటే దాదాపు రూ.32 వేల డిస్కౌంట్‌తో ఐఫోన్ 12ని ఈ దీపావళికి సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. iPhone 12 128GB: రూ.70,900 ఖరీదైన ఐఫోన్ 12 128GB మోడల్‌ను అమెజాన్‌లో రూ.51,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం రూ.13,400 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. అప్పుడు దీని ధర రూ.38,590కి తగ్గుతుంది. అలాగే, బ్యాంక్ ఆఫర్లు సద్వినియోగం చేసుకొని దీని ధరను రూ.1,000 వరకు తగ్గించుకోవచ్చు. అలా ఇంచుమించు రూ.4 వేల తేడాతో మీరు 64GBకి బదులు ఈ 128GB ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. iPhone 12 mini: ఐఫోన్ 12 మినీ 128GB మోడల్ ధర రూ.64,900 ఉండగా అమెజాన్‌లో దీనిని రూ.54,900కే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీపై రూ.13,400 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ A14 బయోనిక్ చిప్సెట్, 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్, IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)