1. ప్రతి ఇంటికి ఒక ఫోన్ నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ వరకు టెక్నాలజీ ఎదుగుతూ వచ్చింది. చాలా కంపెనీలు వివిధ డిజైన్లతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. యాపిల్ కంపెనీ మొదటి ఫోన్ లాంచ్ చేసినప్పటి నుంచి మొబైల్ మార్కెట్లో హవా కొనసాగిస్తోంది. దాదాపు ఏడాదికోసారి లేటెస్ట్ ఫీచర్లతో కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. 2019లో యాపిల్ కంపెనీ ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ చేసింది. దానికి కొనసాగింపుగా ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్ సిరీస్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఐఫోన్ 11 రూ.64,900 రూపాయల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా రికార్డ్ సొంతం చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఫోన్ 11 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా HD డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 12MP డ్యూయల్ సెన్సార్ రేర్ కెమెరా, 12 MP సెల్ఫీ షూటర్ కెమెరా, A13 బయోనికి చిప్ సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ సిరీస్‌లో కర్వెడ్ ఎడ్జెస్‌తో వచ్చిన ఆఖరి ఫోన్ కూడా ఇదే. ఇప్పటికీ ఈ ఐఫోన్ 11 సిరీస్ యాన్యువల్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)