ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన దీపావళి సేల్స్ ముగిశాయి. ఈ సేల్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై బపంర్ ఆఫర్లు ఇచ్చాయి ఆ సంస్థలు. దీంతో దీపావళి సేల్స్ కు మంచి స్పందన లభించింది. అనేక మంది తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువ ధరకే డిస్కౌంట్లతో సొంతం చేసుకున్నారు.(ఫొటో: https://www.amazon.in/)
అయితే.. ఈ ఫెస్టివల్ సేల్ ముగిసిన తర్వాత కూడా పలు ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లను అందజేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు. మీరు తక్కువ బడ్జెట్ LED టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ప్రస్తుతం చాలా మంచి అవకాశం ఉంది. అమెజాన్ మీకు అత్యంత తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(ఫొటో: https://www.amazon.in/)
ప్రస్తుతం.. స్మార్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని రూ. 10,000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. eAirtech 61 cm (eAirtec, 24 అంగుళాల) HD LED మరియు 24 DJ TVని అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తో ప్రస్తుతం ఈ టీవీ ధర కేవలం రూ. 6,999 మాత్రమే కావడం విశేషం.(ఫొటో: https://www.amazon.in/)
ఈ హెచ్డీ టీవీ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. HD డిస్ప్లే (1366 x 768P) మరియు రిఫ్రెష్ రేట్ 60Hz. టీవీలో 2 USB పోర్ట్ కనెక్టివిటీ (పెన్ డ్రైవ్ మరియు హార్డ్ డిస్క్‌లను కనెక్ట్ చేయడానికి), 2 HDMI పోర్ట్‌లు, 1 VGA పోర్ట్ PCతో మానిటర్‌ను కనెక్ట్ చేయడానికి మరియు 1 హెడ్‌ఫోన్ (3.5 mm) పోర్ట్ ఉన్నాయి. దీంతో మీరు మీ హెడ్ఫోన్లను కనెక్ట్ చేయవచ్చు.(ఫొటో: https://www.amazon.in/)