Bullet Train: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి... దేశంలోనే ది బెస్ట్ సిటీగా మార్చేందుకు, వరల్డ్ క్లాస్ టూరిజం డెస్టినేషన్‌గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగా... ఢిల్లీ నుంచి అయోధ్య నగరానికి ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ వేయ్యబోతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేయబోతోంది. (image credit - twitter)
ముందుగా ఒక ట్రైన్ వేసి... ఆ తర్వాత రెండో బుల్లెట్ ట్రైన్ వేసేలా ఈ ప్లాన్ ఉందని తెలిసింది. ఈ బుల్లెట్ ట్రైన్ న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వారణాసి, ప్రయాగరాజ్లను కలుపుతూ వెళ్తుంది. ఈ రెండూ ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రధానమైన పుణ్యక్షేత్రాలు. వీటిని కలుపుతూ వెళ్లడం ద్వారా... టూరిజం బాగా డెవలప్ అవుతుందని కేంద్రం భావిస్తోంది. (image credit - twitter)
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRC)కి చెందిన టీమ్... అయోధ్య వెళ్లి... అక్కడి జిల్లా అధికారులతో చర్చలు జరిపింది. అయోధ్యలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏ ఏరియాలో నిర్మించాలో ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలిసింది. (image credit - twitter)