జియో ప్రవేశం అనంతరం వివిధ టెలికాం సంస్థలు పోటీలు పడీ మరి ఆఫర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు అన్ని సంస్థలు జియో దారికి వచ్చి అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నిత్యం డేటా అందించే ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
BSNL Rs 187 Plan: తాజాగా ప్రభుత్వర రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు రూ.187 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ప్రయోజనం పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ ప్లాన్ ద్వారా నిత్యం 2జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు. రోజు వారీ డేటా ముగిసన తర్వాత కూడా అపరిమితంగా బ్రౌజింగ్ చేయవచ్చు. అయితే స్పీడ్ తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఈ ప్లాన్ తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. నిత్యం 100 ఎస్ఎంఎస్ లు కూడా ఎంజాయ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఈ ప్లాన్ ను పోలిన ఇతర నెట్వర్క్ లు అందించే వివిధ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Airtel Rs 219 Plan: ఎయిర్టెల్ కస్టమర్లు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే నిత్యం 1జీబీ డేటాను 28 రోజుల పాటు పొందుతారు. అన్ లిమిటెడ్ కాలింగ్, నిత్యం 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Jio Rs. 199 Plan: జియో కస్టమర్లు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 1.5 జీబీ డేటా పొందుతారు. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Vi Rs 219 Plan: వోడాఫోన్ కస్టమర్లు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే నిత్యం 1 జీబీ డేటా పొందుతారు. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు. (ప్రతీకాత్మక చిత్రం)