1. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఏకంగా 395 రోజుల వేలిడిటీతో ప్లాన్ ప్రకటించింది. యాన్యువల్ ప్లాన్ కన్నా ఎక్కువ వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ.797. బీఎస్ఎన్ఎల్ యూజర్లు రూ.797 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు మరో 30 రోజుల వేలిడిటీ అదనంగా లభిస్తుంది. మొత్తం కలిపి 13 నెలలు అంటే 395 రోజుల పాటు వేలిడిటీ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ రెండు నెలలు అంటే 60 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ వేలిడిటీ మాత్రం 395 రోజులు ఉంటుంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ దేశమంతా అన్ని సర్కిళ్లల్లో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 30 రోజుల అదనపు వేలిడిటీ పొందాలనుకుంటే జూన్ 12 లోపు రీఛార్జ్ చేయాలి. ఆ తర్వాత రూ.797 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ మాత్రమే లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ పోర్టల్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రీఛార్జ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మరో అద్భుతమైన ఆఫర్ ఉంది. రూ.185, రూ.347 రీఛార్జ్ చేసి నెలకు రూ.1,50,000 వరకు ప్రైజ్ గెలుచుకోవచ్చు. రూ.185 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచితం. ఇక రూ.347 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గేమింగ్ లవర్స్ కోసం ఈ రెండు ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తోంది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి గేమ్స్ ఆడేవారు ప్రైజ్ మనీ, రీఛార్జ్ వోచర్స్ గెలుచుకోవచ్చు. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి నెలకు రూ.1,50,000 వరకు ప్రైజ్ మనీ, రూ.50,000 వరకు రీఛార్జ్ వోచర్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసేముందు నియమనిబంధనలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక బీఎస్ఎన్ఎల్ ఇటీవల రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్లాన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రూ.185, రూ.347 ప్లాన్స్‌పై గేమింగ్ లవర్స్ కోసం ఆఫర్స్ అందిస్తోంది. ఇక రూ.184 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజూ 1జీబీ హైస్పీడ్ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)