ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడీ మరి ఆఫర్లను అందిస్తోంది. దీంతో గతంలో వివిధ కారణాలతో తాను పోగొట్లుకున్న ఖాతాదారులను తిరిగి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది BSNL. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ ధరకే మంచి ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తోంది బీఎస్ఎన్ఎల్.
BSNL RS. 299 Plan: ఈ ప్లాన్ 30 వ్యాలిడిటీ 30 రోజులు. తక్కువ రోజులు అంటే షార్ట్ టర్మ్ ప్లాన్లను తీసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 90 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 30 రోజుల పాటు నిత్యం 3GB హైస్పీడ్ డేటా లభిస్తుందన్నమాట. డైలీ డేటా కోటా ముగిసన అనంతరం కూడా అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే స్పీడ్ 80 Kbpsకి తగ్గుతుంది.
కేవలం డేటా బెనిఫిట్స్ మాత్రమే కాదు.. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు వ్యాలిడిటీ ముగిసే అంత వరకు అంటే.. 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఇంకా నిత్యం 100 SMSలు లభిస్తాయి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు అదే ధరకు అందిస్తున్న ప్రయోజనాలతో పోలిస్తే ఇది బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పవచ్చు.