ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలకు గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచనలతో ఆ ఆఫర్లను ప్రవేశ పెడుతోంది బీఎస్ఎన్ఎల్. ఈ నేపథ్యంలో రూ.100 కన్నా తక్కువ ధరలో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్లలో కాలింగ్ మరియు డేటా సేవలు రెండూ అందుబాటులో ఉండడం విశేషం.
BSNL Rs 87 Plan: చాలా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలనుకుంటున్న వినియోగదారులు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. 1 జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఈ డేటా ముగిసిన అనంతరం డేటా స్పీడ్ 40 kbpsకు పడిపోతుంది. నిత్యం 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్ లో లోకల్, STD కాలింగ్ సర్వీస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
BSNL RS.97 Plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు. కొంచెం డేటా ఎక్కువగా వినియోగించే వారు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు వ్యాలిడిటీ ముగిసే వరకు నిత్యం 2 జీబీ డైలీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. డైలీ డేటా ముగిసిన అనంతరం స్పీడ్ 40Kbps వేగానికి పడిపోతుంది.