BSNL Plans Under Rs 20: రూ. 20కే డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. BSNL నుంచి సంచలన ఆఫర్లు..
BSNL Plans Under Rs 20: రూ. 20కే డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. BSNL నుంచి సంచలన ఆఫర్లు..
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL రూ. 20 లోపే అన్ లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ఆఫర్లను తీసుకువచ్చింది. ఆ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1/ 6
ప్రముఖ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడుతూ ఇటీవల అనేక నూతన ఆఫర్లను ప్రవేశ పెడుతోంది. తద్వారా కోల్పోయిన వినియోగదారులను మళ్లీ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
2/ 6
ఈ నేపథ్యంలో రూ. 20లోపు 2 కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది బీఎస్ఎన్ఎల్. ఆ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, కలిగే ప్రయోజనాలు మీ కోసం..
3/ 6
BSNL Rs 18 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. డైలీ డేటా ముగిసన అనంతరం స్పీడ్ 80 కేబీపీఎస్ కు పడిపోతుంది.
4/ 6
అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. ఖాతాలో అనుకోకుండా ఎక్కువ డబ్బులు లేని సమయంలో తాత్కాలికంగా ఈ ప్లాన్ ను ఎంచుకోవడం బెటర్.
5/ 6
BSNL Rs 16 Plan: బీఎస్ఎన్ఎల్ డేటా అత్యధికంగా వినియోగించే వారి కోసం ఈ ప్లాన్ తీసుకువచ్చింది. మీకు డైలీ డేటా అయిపోయానా.. లేదా మీకు కేవలం వాయిస్ కాల్స్ కు సంబంధించిన ప్లాన్ మాత్రమే ఉన్నా డేటా కోసం ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
6/ 6
ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే. అయితే, డైలీ డేటా అయిన అనంతరం అదనంగా డేటా కావాల్సిన సందర్భంలో ఈ ప్లాన్ ను ఎంచుకోవడం బెటర్.