స్మార్ట్‌ఫోన్ వాడకం ఎక్కువైన దగ్గర నుంచి ఇయర్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. విభిన్న రకాలు, స్టైల్స్ లో ఇయర్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో నెక్ బ్యాండ్ స్టైల్ వైర్లెస్ ఇయర్ ఫోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. తాజాగా బౌల్ట్ ఆడియో నుంచి ప్రో బాస్ ఎక్స్1 ఎయిర్ వైర్లెస్ ఇయర్ ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటి స్టాండ్ బై టైం మూడు నెలల వరకు ఉంటుంది. ఈ సరికొత్త బోల్ట్ ఆడియో ప్రోబాస్ ఎక్స్-1 ఎయిర్ ఇయర్ ఫోన్లలో మైక్రో వూఫర్ డ్రైవర్స్ ఫీచర్ కూడా ఉంది. వీటితో పాటు ఏరోస్పేస్ గ్రేడ్ అల్లాయ్ ప్రైమరీ డ్రైవర్లను ఇందులో అదనంగా పొందుపరిచారు. ఈ ఇయర్ ఫోన్లలో ఐపీ ఎక్స్-5 ధ్రువీకరించిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. అవసరమైవేతే వీటిని వాష్ కూడా చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
భారత మార్కెట్లో వీటి ధర : భారత మార్కెట్లో ఈ సరికొత్త బౌల్ట్ ఆడియో ప్రోబాస్ ఎక్స్-1 ఎయిర్ ఇయర్ ఫోన్ల ధరను సంస్థ రూ.999గా నిర్దేశించింది. ఇందులో ఉండే మైక్రో వూఫర్ డ్రైవర్స్ వల్ల డీపర్ బాస్‌తో పాటు అవరోధాలు లేకుండా స్పష్టమైన అనుభూతి పొందవచ్చు. బౌల్ట్ ఆడియో నుంచి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్లు నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఓ సంవత్సరం వారంటీ కూడా వీటికి ఉంది.
బౌల్ట్ ఆడియో ప్రో బాస్ ఎక్స్-1 ఎయిర్ స్పెసిఫికేషన్లు : ఈ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్లలో ఫీచర్లకు కొదవే లేదు. వీటిలో ఎయిర్ స్పేస్ గ్రేడ్ అల్లాయ్ డ్రైవర్లు, మైక్రో వూఫర్ డ్రైవర్ల వల్ల డీపర్ బాస్‌ను యూజర్లు అనుభూతి చెందవచ్చు. వీటికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ వల్ల గంటన్నరలోనే పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీని స్టాండ్ బై టైం మూడు నెలల వరకు ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ఇవి కాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని ఈ డివైజ్‌లో పొందుపరిచారు. మెరుగైన ఫిట్మెంట్ కోసం 60 డిగ్రీల కోణంలో టన్నెల్ డిజైన్‌ను రూపొందించారు. ఇందులోని వాటర్ రెసిస్టెన్స్‌ను ఐపీఎక్స్-5 ధ్రువీకరించింది. ఈ ఇయర్ ఫోన్లు 150X20X180 ఎంఎం ప్రమాణాలను కలిగి ఉండి 80 గ్రాముల బరువున్నాయి. నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లు గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది.