1. ఇండియాలో ఆడియో ప్రొడక్ట్స్‌తో పాటు వేరబుల్ మార్కెట్లోనూ టాప్ ప్లేస్ లక్ష్యంగా దూసుకుపోతోంది బోట్ (BoAt) కంపెనీ. ఇప్పటికే ఈ సంస్థ ఎన్నో స్మార్ట్‌వాచ్‌లను మన దేశంలో రిలీజ్ చేసింది. వీటిలో తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను అందిస్తూ మార్కెట్ పెంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘వేవ్ అల్టిమా’ పేరుతో మరో స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ భారత్‌లో లాంచ్ చేసింది. (image: BoAt India)
2. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆటో వర్క్ అవుట్ డిటెక్షన్, యోగా, స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ క్రాక్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌తో, కర్వ్ ఆర్క్ డిస్ప్లేతో, సరికొత్త డిజైన్‌లో కనిపిస్తోంది. దీని ధర, స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం. (image: BoAt India)
3. బోట్ వేవ్ అల్టిమా స్మార్ట్‌వాచ్.. 500 ఎడ్జ్-టు-ఎడ్జ్ ఆల్వేస్ ఆన్ కర్వ్డ్ ఆర్క్ డిస్ప్లేతో, 1.8-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. వేవ్ అల్టిమా స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ v5.3 చిప్సెట్ ఉంటుంది. మైక్రోఫోన్‌తో పాటు ఇన్‌బిల్ట్ HD స్పీకర్‌తో జత చేసిన బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఈ వాచ్ ప్రత్యేకతలు. BT కాలింగ్ ఫెసిలిటీతో బెస్ట్ కాల్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. (image: BoAt India)
4. ఇది బోల్డ్ యూజర్ ఇంటర్ఫేస్తో వచ్చే హైలీ రెస్పాన్సివ్ వాచ్ అని కంపెనీ పేర్కొంది. మెనూ కస్టమైజేషన్‌తో రింగ్‌టోన్ మార్చుకోవచ్చు. ఈ BT వాచ్ IP68 డస్ట్, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెంట్ బాడీతో వస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తో మూడు రోజులు, సాధారణ వినియోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. (image: BoAt India)
5. సాఫ్ట్ సిలికాన్ పట్టీలతో వచ్చే ఈ డివైజ్ బాడీని తేలికపాటి అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేశారు. హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, స్ట్రెస్ మానిటర్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ వంటి హై రేంజ్ స్పెసిఫికేషన్లతో ఈ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకుంటోంది. ఫ్లాష్‌లైట్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్, DND, వరల్డ్ క్లాక్, స్టాప్‌వాచ్ వంటి ఇతర ఫీచర్లు దీని సొంతం. (image: BoAt India)