1. ఏప్రిల్ 14న ఇండియాలో ఎఫ్ 900 ఎక్స్ఆర్ (F 900 XR) అప్డేటెడ్ వెర్షన్ (Updated Version)ను రూ.12.3 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్ చేసింది. 895-సీసీ ఇంజన్‌తో వచ్చే ఇది 105 hp అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిమీల వేగాన్ని అందుకోవడం విశేషం. ఇది గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరర్ బైక్ కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే ఇది వేరే దేశంలో కంప్లీట్ గా అసెంబుల్ అయ్యి ఇండియాకి దిగుమతి అవుతుంది. ఈ బైక్ ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బైక్ డెలివరీలు జూన్ 2022 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరర్ అయిన F 900 XR కొత్త వెర్షన్ పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుందని అన్నారు. 2020లో BMW F 900 XR బైక్ తొలిసారిగా లాంచ్ అయ్యింది. అయితే దీనికి మరిన్ని ఫీచర్లను యాడ్ చేస్తూ 2022 వెర్షన్ ని తీసుకొచ్చారు. ఇందులో BS6-కంప్లైంట్ ఇంజన్, న్యూ సేఫ్టీ ఫీచర్లతో సహా చాలా కొత్త అప్డేట్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. 2022 BMW F 900 XR బైక్ డ్యూయల్ హెడ్‌ల్యాంప్‌లు, చిన్న వైజర్, షార్ప్ ఫేస్‌ను కలిగి ఉంది. ఇందులో 6.5-అంగుళాల కలర్డ్ TFT డిస్ప్లే, బీఎండబ్ల్యూ మోటోరాడ్ కనెక్టివిటీ యాప్, LED లైట్లు, రైడింగ్ మోడ్లు, అడ్జస్టబుల్ లివర్స్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్, కాస్ట్ అడ్జస్ట్ చేయగల అల్యూమినియం వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ బైక్ BS6 895 cc, వాటర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇన్-లైన్ 2-సిలిండర్ ఇంజన్ ద్వారా 103 bhp @8,500 rpm, గరిష్టంగా 92 Nm @6,500 rpm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)