మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రూ.20వేల కంటే తక్కువ బడ్జెట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 6.6-అంగుళాల పూర్తి-HD + AMOLED డిస్ప్లేతో బ్లూ బోల్డ్ N2 లాంచ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌తో అమర్చబడింది. ఈ ఫోన్ 8GB RAM అండ్ 256GB వేరియంట్ లో లభిస్తోంది.
ఫోన్లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. బ్లూ బోల్డ్ N2 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా.. సెల్ఫీ మరియు వీడియో కోసం ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది. 20 వేల లోపు ధరకే ఈ ఫోన్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ Android 11లో రన్ అవుతుంది.
అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు.. ఫేస్ ఐడీ కూడా ఉంది. క్వాడ్ రియర్ AI కెమెరా సెటప్ స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వబడింది. ఇది 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 115-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 5-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ను కలిగి ఉంది.