1. మీరు ఫేస్బుక్ వాడుతున్నారా? అయితే అలర్ట్. ఓసారి మీ డేటా లీక్ అయిందేమో చూసుకోండి. వెంటనే పాస్వర్డ్స్ మార్చేయండి. ఫేస్బుక్లో మీ వివరాలు కాస్త తక్కువ ఉండేలా చూసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్బుక్ డేటా లీక్ అయినట్టు వార్తలొస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఈ డేటా ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నది ఆ వార్తల సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. అయితే ఈ డేటా చాలా పాతదే అని తెలుస్తున్నా లీక్ అయిన సమాచారం మాత్రం కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఈ డేటా సేకరించినట్టు బిజినెస్ ఇన్సైడర్ కథనం పబ్లిష్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఆ కథనం ప్రకారం 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఫేస్బుక్ డేటాకు సంబంధించిన సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఫీచర్‌ను డిసేబుల్ చేసింది ఫేస్బుక్. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. అప్పుడే కాదు 2019 డిసెంబర్లో ఉక్రెయినియన్ సెక్యూరిటీ రీసెర్చర్ కూడా 26.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, యూజర్ ఐడీలు లీక్ అయినట్టు గుర్తించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. అయితే లీక్ అయిన డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్బుక్ క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)