చాలా మందికి యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగించాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థిక పరిమితులు అడ్డు వస్తుంటాయి. అలాంటి వారు ఐఫోన్లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ-కామర్స్ కంపెనీల స్సెషల్ సేల్స్‌లో తక్కువ ధరకు ఐఫోన్ మోడల్స్‌ను పొందేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నుంచి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. స్పెషల్ డీల్ కింద ఐఫోన్ 12 మినీ(iPhone 12 Mini)ని సగం రేటుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 12 మినీ స్సెసిఫికేషన్లు
యాపిల్ ఐఫోన్ 12 మినీ 5.4-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ మోడల్.. 4.7 అంగుళాల iPhone SE, 6.1 అంగుళాల iPhone 12 మధ్య ఉంటుంది. SE కంటే చిన్న ప్యాకేజీలో పవర్ఫుల్ హార్డ్‌వేర్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 మినీలో OLED డిస్ప్లే, 5nm Apple A14 బయోనిక్ ప్రాసెసర్, డ్యూయల్-కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ మోడల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్(Wireless Charging) ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌తో వచ్చే 64GB బేసిక్ స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసుకొనే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)