ఫ్లిప్కార్ట్లో బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రారంభమైంది. ఈ నెల 3న ప్రారంభమైన ఈ సేల్ రేపటి వరకు అంటే.. ఈ నెల 5 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై 70% వరకు డిస్కౌంట్ అందించనుంది ఫ్లిప్ కార్ట్. విశేషమేమిటంటే.. కొన్ని స్మార్ట్ టీవీలను సెల్లో సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీ ల గురించి తెలుసుకుందాం... (ఫొటో: https://www.flipkart.com/)
కస్టమర్లు TCL యొక్క iFFALCON U62 (43 అంగుళాల) అల్ట్రా HD (4K) LED TVని 51% తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ కింద, ఈ టీవీని రూ.49,990కి బదులుగా కేవలం రూ.23,999కే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్ కార్ట్. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.11,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)