సాంసంగ్ సరికొత్త సౌండ్‌బార్ 39.9mm సైజ్ అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో, కాంపాక్ట్ సబ్‌వూఫర్‌తో వస్తుంది. ఇది 3 ఛానెల్‌లు, 1 సబ్ వూఫర్ ఛానెల్, 2 అప్-ఫైరింగ్ ఛానెల్‌లతో అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులో 3D ఎక్స్పీరియన్స్ కోసం Dolby Atmos, DTS Virtual:X అందించారు. అడాప్టివ్ సౌండ్, యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.44,990.
బోస్ స్మార్ట్ సౌండ్‌బార్ 900 డాల్బీ అట్మోస్‌తో పాటు డైలాగ్, ఎఫెక్ట్‌లను వేరుచేసే సరికొత్త టెక్నాలజీలతో వస్తుంది. ఈ సౌండ్‌బార్ రెండు కొత్త అప్‌వర్డ్-ఫైరింగ్ డైపోల్ ట్రాన్స్డ్యూసర్లతో సహా తొమ్మిది స్పీకర్లతో వస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇచ్చి ఈ స్పీకర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులోని నాయిస్-రిజెక్టింగ్ మైక్రోఫోన్లు వాయిస్ కమాండ్లను సరిగ్గా రిసీవ్ చేసుకుంటాయి. దీని ధర రూ.1,04,900.
సోనీ HT-S40Rలో 3-ఛానల్ సౌండ్‌బార్, వైర్లెస్ బ్యాక్ స్పీకర్లు, ట్రూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేక సబ్ వూఫర్ ఉంటాయి. డాల్బీ డిజిటల్‌తో ఈ 600W సౌండ్‌బార్ సిస్టమ్ సరౌండ్ సౌండ్ 5.1 ఛానెల్‌లను అందిస్తుంది. ఇది HDMI ARC, ఆప్టికల్, అనలాగ్ ఇన్‌పుట్‌లతో సహా పలు కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. దీని ధర రూ.26,990.
జేబీఎల్ బార్ 550W పవర్, 10-అంగుళాల సబ్-వూఫర్‌తో వైర్లెస్ 5.1 హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇందులోని మల్టీ బీమ్ టెక్నాలజీ స్పీకర్లు, వైర్లు లేకపోయినా అద్భుతమైన సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. 4K పాస్-త్రూ ఫీచర్‌తో 4K డేటాను 4K TV లేదా ప్రొజెక్టర్‌లో డిస్ప్లే చేయవచ్చు. Chromecast, Airplay 2 ఆన్లైన్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి ఉపయోగపడతాయి. దీని ధర రూ. 42,999.