వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ
రూ. 30 వేలలోపు ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ బెస్ట్ ఆప్షన్. వన్‌ప్లస్ సాధారణంగా ప్రీమియం ఫోన్లను మాత్రమే రిలీజ్ చేస్తుంటుంది. కానీ, ఇటీవలి కాలంలో మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్ల మార్కెట్ పెరుగుతున్న దృష్ట్యా కేవలం రూ. 23,999 ధరకే దీన్ని విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ CE 2 5G 6.43- అంగుళాల ఫుల్- హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్లో 64- మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చింది. దీనిలోని 4500mAh బ్యాటరీ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
షియోమి ఎంఐ 11i హైపర్‌ఛార్జ్
రూ. 30 వేలలోపు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఫోన్ కావాలంటే.. షిమోమి ఎంఐ 11ఐ బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 26,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలోని 4500mAh బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)