లావా అగ్ని (Lava Agni) 5G: 5జీ సెగ్మంటల్లో లావా లాంచ్ చేసిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,999. మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో మీకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు రెడీగా ఉంది. 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ మెమొరీతో అందుబాటులో ఉంది.
మోటో (Moto) G60: భారత్‌తో రూ. 20 వేలలోపు దొరుకుతున్న అత్యుత్తమ మొబైల్స్‌లో మోటో జీ60 కూడా ఒకటి. స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో ఉన్న దీని హార్డ్‌వేర్ సూపర్ అనే చెప్పాలి. 6,000 mAh బ్యాటరీకి తోడు 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో మొబైల్‌ను క్షణాల్లో చార్జ్ చేయొచ్చు. 108MP క్వాడ్ కెమెరాతో ఫోటోలను తీయడంలో దిట్ట. దీని ధర రూ. 17,999.
పొకో (Poco) X3 ప్రో: రూ. 20 వేల లోపు దొరుకుతున్న ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. స్పాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో 120Hz ఎల్సీడీ (LCD) డిస్ప్లేతో గేమింగ్‌కు సౌకర్యంగా ఉంటుంది. దీని బ్యాటరీ 5,160 ఎంఏహెచ్‌తో పాటు 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 48 MP క్వాడ్ కెమెరా సెటప్ సౌకర్యం కలదు. ఈ మొబైల్ ధర రూ. 18,999.
రెడ్మీ నోట్ (Redmi Note) 10 ప్రో మ్యాక్స్: రూ.20ల లోపు దొరుకుతున్న మరో అత్యుత్తమ ఫోన్ ఇది. 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో... 108MP క్వాడ్ కెమెరా సెటప్‌తో ఎటువంటి టాస్క్‌నైనా హ్యాంగ్ కాకుండా కంప్లీట్ చేయగలదు. దీని బ్యాటరీ 5020 mAh. 732 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ మొబైల్ రెడీగా ఉంది.
రియల్ మీ (Realme) 8 ప్రో: ఫోటో క్వాలిటీ ఉండాలనుకునే వారు ఈ మొబైల్‌ను ప్రిఫర్ చేయొచ్చు. 108 MP క్వాడ్ కెమెరాతో సూపర్ క్వాలిటీతో ఈ ఫోన్ ఫోటోలను తీయగలదు. దీని ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 720G... బ్యాటరీ కెపాసిటీ 4,500 mAh. 50 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో నిమిషాల్లో మొబైల్‌ను చార్జ్ చేయొచ్చు. అమోల్డ్ డిస్ప్లేతో ఉన్న ఈ మొబైల్ రూ. 17,999లకు దొరుకుతుంది.
శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy) A22: శాంసంగ్ నుంచి 5జీలో దొరుకుతున్న మొబైల్స్‌లో ఇదే చౌకైన మొబైల్. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అత్యుత్తమ యూజర్ ఇంటర్ఫేస్ను ఈ మొబైల్ అందిస్తుంది. 48MP ట్రిపుల్ రియర్ కెమెరాతో ఫోటోలను బెస్ట్ క్వాలిటీతో క్యాప్చర్ చేయగలదు. దీని యూఐ కస్టమర్లను ఇట్టే ఆకర్షించగలదు.
ఇన్ఫినిక్స్ నోట్ (The Infinix Note) 10ప్రో: 8GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.20 వేల లోపు అందుబాటులో ఉన్న ఏకైక మొబైల్ ఇదే. దీని ధర రూ.16,999 అయితే దీని ప్రాసెసర్ ఇతర మొబైల్స్‌తో పోలిస్తే కాస్త తక్కువ పర్ఫామెన్స్తో పనిచేస్తుంది. 6464 MP క్వాడ్ కెమెరా సెటప్‌తో ఫర్వాలేదనిపిస్తుంది. దీని బ్యాటరీ 5000 ఎంఏహెచ్. స్టీరియో స్పీకర్స్ మీకు థియేటర్ అనుభూతిని అందించగలవు.