ఈ ఫోన్ 6.5 -అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీని అందించింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో 48 -మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, 8 -మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ కెమెరాను చేర్చింది.
రియల్మీ 8ఐ
ప్రస్తుతం భారతదేశంలో రూ. 15,000 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో రియల్మీ 8i కూడా ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 6.6 -అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీ, 50 -మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించింది.
ఇన్ఫినిక్స్ నోట్10
ఇన్ఫినిక్స్ నోట్ 10 కూడా రూ. 15 వేల ధరలో లభించే అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ 6.95 -అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీని అందించింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 48- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ కెమెరాలను అందించింది.
శామ్సంగ్ గెలాక్సీ M32... గతేడాది భారత మార్కెట్లోకి లాంచ్ అయిన శామ్సంగ్ గెలాక్సీ M32 ప్రస్తుతం రూ. 15 వేల ధర ట్యాగ్‌లో లభిస్తున్న అత్యుత్తమ ఫోన్లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 -అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో G80 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 6000mAh బ్యాటరీని అందించింది. 20 -మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్, 64 -మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరాలను చేర్చింది.