* iQOO Z6 5G
ఐక్యూ Z6 5G మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్ LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో పనిచేస్తుంది. 50MP సెన్సార్, 2MP సెన్సార్, 2MP సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ను ఇందులో ఉంది. ఈ డివైజ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
* Moto G71 5G
మోటో G71 5G ఫోన్ 6.4-అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో పనిచేస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP సెన్సార్ ఉన్నాయి. దీంట్లోని 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. (image: Motorola India)
* Redmi Note 11T
రెడ్మీ నోట్ 11 సిరీస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్తో వస్తుంది. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 5G కనెక్టివిటీ, ఇతర ఫీచర్లతో లభిస్తుంది. 50MP సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాను కూడా అందించారు.
* Vivo T1
వివో T1 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 50MP సెన్సార్, 2MP సెన్సార్, 2MP లెన్స్ ఉండే ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్ దీంట్లో ఉన్నాయి. ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఉంది, అయితే ఇది 18W ఫాస్ట్ చార్జింగ్కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)