2. ఇందుకోసం మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీరు మీ మొబైల్ నెట్వర్క్ ఎక్కువ ఉపయోగించేది కాల్స్ కోసమా? డేటా కోసమా? మీరు నెలలో చేసే కాల్స్ ఎక్కువా? తక్కువా? డేటా ఎక్కువ వాడుతారా? వైఫై ఎక్కువ ఉపయోగిస్తారా? ఇలా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే ప్లాన్ సెలెక్ట్ చేయడం సులువు. (ప్రతీకాత్మక చిత్రం)
4. టైప్ సీ యూజర్లు ఎక్కువగా ప్రయాణించేవాళ్లు. వర్క్, ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ డేటా ఉపయోగిస్తారు. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు. మీరు ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఓ కేటగిరీలో ఉంటే రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Reliance Jio: మీరు టైప్ ఏ యూజర్ అయితే మీకు జియోలో రూ.98 ప్లాన్ చాలు. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్లు వస్తాయి. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. ఇతర నెట్వర్క్కి కాల్ చేయాలంటే రూ.10 టాప్ అప్ రీఛార్జ్ చేస్తే 124 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Reliance Jio: టైప్ బీ యూజర్ అయితే రూ.329 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ హైస్పీడ్ డేటా, జియోకు అన్లిమిటెడ్ కాల్స్ ఉచితం. ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది. 1,000 ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి. 28 రోజులకు రూ.98 రీఛార్జ్ చేయడం కన్నా 84 రోజులకు రూ.329 రీఛార్జ్ చేయడం మేలు. (ప్రతీకాత్మక చిత్రం)
8. Reliance Jio: ఇదే ప్లాన్ 84 రోజులకు తీసుకుంటే రూ.555 రీఛార్జ్ చేయాలి. ఇతర నెట్‌వర్క్స్‌కి 3,000 నిమిషాలు ఉచితం. మీకు రోజూ 2 జీబీ డేటా కావాలంటే రూ.599 రీఛార్జ్ చేయాలి. మిగతా బెనిఫిట్స్ అన్నీ రూ.555 ప్లాన్‌లో ఉన్నట్టే ఉంటాయి. రోజూ 3 జీబీ డేటా కావాలంటే 28 రోజులకు రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. Airtel: టైప్ బీ యూజర్ అయితే రూ.379 రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ. 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్లు, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాలింగ్ ఉచితం. 365 రోజులకు రూ.1,498 రీఛార్జ్ చేస్తే 3,600 ఎస్ఎంఎస్లు, 24 జీబీ డేటా వస్తుంది. వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
11. Airtel: మీరు టైప్ సీ యూజర్ అయితే రూ.598 రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ. రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా కావాలంటే రూ.449 లేదా 3జీబీ డేటా కావాలంటే రూ.558 రీఛార్జ్ చేయాలి. వేలిడిటీ 56 రోజులే. అన్ని ప్లాన్స్‌పై రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాలింగ్, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
12. Vodafone: మీరు టైప్ ఏ యూజర్ అయితే రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. రూ.64 టాక్‌టైమ్ వస్తుంది. సెకనుకు 1 పైసా చొప్పున ఛార్జీలుంటాయి. 200 ఎంబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. రూ.95 రీఛార్జ్ చేస్తే రూ.74 టాక్‌టైమ్ వస్తుంది. సెకనుకు 2.5 పైసా చప్పున ఛార్జీ ఉంటుంది. 200 ఎంబీ డేటా లభిస్తుంది. 56 రోజుల వెలిడిటీ. (ప్రతీకాత్మక చిత్రం)
14. Vodafone: టైప్ సీ యూజర్ అయితే రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 56 రోజులు. రూ.699 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 84 రోజులు. (ప్రతీకాత్మక చిత్రం)