ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC చిప్‌తో పనిచేస్తుంది. 6 GB RAM, 64 GB స్టోరేజ్, 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లతో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 12 5G ధర (6 GB RAM/ 64 GB స్టోరేజ్) రూ. 14,999.
మోటొరోలా 6G31 ఫోన్ 4-అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలు, 13MP సెల్ఫీ కెమెరా, వాటర్ రిపెల్లెంట్ డిజైన్.. వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో G85 చిప్, 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 వంటి ప్రత్యేకతలతో వచ్చిన మోటొరోలా G31 ధర (6 GB RAM/ 128 GB స్టోరేజీ) రూ. 13,999.
ఈ 5G బడ్జెట్ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్ ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇది 6 GB RAM, 128 GB స్టోరేజ్‌తో లభిస్తుంది. దీంట్లోని స్నాప్‌డ్రాగన్ 480 SoC చిప్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 mAh బ్యాటరీ దీని సొంతం. ఒప్పో A74 5G ఫోన్ 6 GB RAM/ 128 GB వేరియంట్ ధర రూ.14,990.
ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో పనిచేస్తుంది. 6 GB RAM, 128 GB స్టోరేజ్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీని, 33W SuperVOOC ఛార్జర్‌తో వచ్చిన ఒప్పో కే10 ఫోన్ 6 GB RAM/128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990.
రెడ్మీ నోట్ 11 ఫోన్ 6.43-అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌తో, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6 GB RAM, 64 GB స్టోరేజ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC చిప్, 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన నాలుగు రియర్ కెమెరాలు, 13MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 13 వంటి స్పెసిఫికేషన్లతో వచ్చిన రెడ్మీ నోట్ 11 (6 GB RAM/ 64 GB స్టోరేజ్) ధర రూ. 13,999.