1. ఏసుస్ ఇటీవల ఇండియాలో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఏసుస్ 8జెడ్ (Asus 8Z) మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 (Qualcomm Snapdragon 888) ప్రాసెసర్ ఉండటం విశేషం. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ 9ఆర్టీ (OnePlus 9RT), ఐకూ 9 ఎస్ఈ (iQOO 9 SE), షావోమీ 11టీ ప్రో 5జీ (Xiaomi 11T Pro 5G) లాంటి స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. (image: Asus India)
2. గతేడాది గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ అయిన జెన్‌ఫోన్ 8 రీబ్రాండ్ వర్షన్‌గా ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇంతకుముందే ఏసుస్ రోగ్ ఫోన్ 5ఎస్, ఏసుస్ రోగ్ ఫోన్ 5ఎస్ ప్రో స్మార్ట్ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెర్తో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. (image: Asus India)
3. ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఏసుస్ 8జెడ్ రిలీజైంది. ధర రూ.42,999. ఒబ్సిడియన్ బ్లాక్, హొరైజన్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Asus India)
4. ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 5.9 అంగుళాల సాంసంగ్ ఈ4 అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఏసుస్ జెన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Asus India)
5. ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ Sony IMX686 ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ Sony IMX363 సెకండరీ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 8K వీడియోలు రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇన్స్టంట్ కెమెరా స్విచింగ్, డ్యూయెల్ పీడీ ఆటోఫోకస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Asus India)
7. ఏసుస్ 8జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, హెడ్‌ఫోన్ జాక్, 3.5ఎంఎంజాక్, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, Wi-Fi 6E సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + జెన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Asus India)