NASA Asteroid Alert: ఈమధ్య పెద్ద పెద్ద గ్రహశకలాలు భూమివైపు తెగ వస్తున్నాయి. ఒకటి వెళ్లిపోయింది కదా అనుకునేలోపు మరొకటి వస్తోంది. 39 అడుగుల వ్యాసార్థం ఉన్న ఓ గ్రహశకలం సెప్టెంబర్ 1న భూమివైపు నుంచి వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) చెప్పింది. భూమికీ చంద్రుడికీ మధ్య ఉన్న దూరం కంటే... తక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్తుందని నాసా చెప్పింది.
ఈ గ్రహశకలం సెకండ్‌కి 8.16 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అంటే... హైదరాబాద్ నుంచి విశాఖకు ఇది... 75 సెకండ్లలో వెళ్లగలదు. అంటే 2 నిమిషాల్లోపే వెళ్లగలదు. అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇది 194 సెకండ్లలో అంటే... నాలుగు నిమిషాల్లోపే వెళ్లగలదు. దీన్ని బట్టీ ఇది ఎంత వేగంగా దూసుకెళ్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇది వరకు 2011లో ఈ గ్రహశకలం భూమివైపు వచ్చినప్పుడు... ఇది నాలుగు రోజులపాటూ ప్రజలకు కనిపించింది. ఈసారి ఇంకా దగ్గర నుంచి వెళ్లబోతోంది. కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. ప్రతి 9 ఏళ్లకోసారి ఈ గ్రహశకలం భూమివైపు వస్తుంది. ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో నాసా దీన్ని చేర్చింది. అంటే... ఎప్పటికైనా దీని వల్ల భూమికి డేంజరే.