వీక్షకులు ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే దాని ఆధారంగానే ఈ అల్గారిథమ్ పనిచేస్తుంది. ఇతర సోషల్ నెట్ వర్క్ ప్లాట్‌ఫాంలు సూచించే వీడియోలను యూట్యూట్ రికమండ్ చేయదు. మిక్స్ నుంచి వీడియో చూసే వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ద్వారా, సర్వేలు నిర్వహించడం ద్వారా, వీడియోలపై క్లిక్కులు, వాచ్ టైమ్, వీడియో షేర్స్ చేసిన విధానాన్ని బట్టి రికమండేషన్స్‌ను యూట్యూట్ అంచనా వేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రికమండేషన్స్ స్విచాఫ్ చేయవచ్చు. వీక్షకులు వీడియోలు చూసిన తరువాత వారు హిస్టరీ డిలీట్ చేస్తే, వారికి రికమండేషన్స్ కూడా స్విచాఫ్ అవుతాయి. 2011లో రికమండేషన్స్ ద్వారా ఎక్కువగా వీక్షించిన తక్కువ క్వాలిటీ కలిగిన కంటెంట్‌ను అదుపు చేసింది. 2015లో మైనర్లను సమస్యల్లో పడవేస్తాయని భావించిన వీడియోలను రికమండేషన్స్ నుంచి తొలగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
భాష ఆధారంగా రికమండేషన్స్ ఉండవు. వీక్షకులు చూసే వీడియోల ఆధారంగా అనేక వీడియోలను రికమండ్ చేస్తామని క్రిస్టోస్ గుడ్రో తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ భాషలో ఎక్కువగా వీడియోలు వీక్షిస్తే ఆ తరువాత కోడ్ ఆధారంగా అవే వస్తాయని గుడ్రో వెల్లడించారు. ఇన్ కాగ్నిటో మోడ్‌లో డివైజ్ ఉంటే ఆ ప్రాంతంలో ఏ కంటెంట్ బాగా వీక్షిస్తున్నారో వాటిని యూట్యూబ్ రికమండ్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్ సెర్చ్, క్రోమ్ మాదిరిగానే యూట్యూబ్ సెర్చ్ పనిచేస్తుంది. అయితే ఆథరైడ్జ్ వీడియోలకు మాత్రం ఈ జాబితాలో ప్రాధాన్యం ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్ లో కంటెంట్ కోసం సెర్చ్ చేసినప్పుడు నమ్మకమైన అథారిటీ ఉన్న వర్గాల వీడియోలను మొదటి వరుసలో వచ్చేలా చేస్తారు. అంతగా నమ్మకం లేని, అన్ ఆథరైజ్డ్ వీడియోలు తరువాత వరుసలో వస్తాయి.
(ప్రతీకాత్మక చిత్రం)