ఇప్పుడంతా డిజిటల్ యుగంలా మారిపోయింది. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వాలు కూడా ప్రొత్సహిస్తుండటంతో.. స్మార్ట్ ఫోన్ ద్వారా లావాదేవీలు జరిగిపోతున్నాయి. అనేక బ్యాంకులు తమ యాప్స్‌ను ప్రవేశపెట్టి.. లావాదేవీలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి కస్టమర్ల అకౌంట్లలోని డబ్బులను దోచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులు సైతం అజాగ్రత్తగా, అవగాహన లేకుండా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగించడం వారికి కలిసొస్తుంది. కొందరు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) (ప్రతీకాత్మక చిత్రం)