1. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) టెలికామ్ కంపెనీలన్నీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. వేలిడిటీ పూర్తైనవారు కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నవారికీ ఈ కొత్త ప్లాన్స్ వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీరు కాల్స్ ఎక్కువగా డేటా తక్కువగా ఉపయోగించేటట్టైతే మీకు రోజూ 1.5జీబీ లేదా 1జీబీ డేటా లభించే ప్లాన్స్ సరిపోతాయి. మరి మీరు జియో కస్టమర్ అయితే రోజూ 1.5జీబీ లేదా 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలుసుకోండి. ఈ కింద వెల్లడించిన ప్లాన్స్ అన్నింటికీ వాయిస్ కాల్స్ బెనిఫిట్స్‌తో పాటు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. జియో రూ.119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 21జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 34.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. జియో రూ.239 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.199 ఉండగా ఇప్పుడు రూ.239 ధరకు పెరిగింది. జియో రూ.479 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.399 ఉండగా ఇప్పుడు రూ.479 ధరకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.555 ఉండగా ఇప్పుడు రూ.666 ధరకు పెరిగింది. జియో పాపులర్ ప్లాన్స్‌లో ఇది కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
7. జియో రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 24జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ రూ.149 ఉండగా ఇప్పుడు రూ.179 ధరకు పెరిగింది. జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 20 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 20జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)