1. స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఆడే ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో వీడియో గేమ్స్‌కి (Video Games) అతుక్కుపోయారు కుర్రాళ్లు. బ్యాటిల్ రాయల్ లాంటి గేమ్స్ ఆడుతూ గంటలుగంటలు గడిపేస్తున్నారు. ఇవే కాదు... చాలా గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో (Google Play Store) అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే ఈ గేమ్స్ ఆడేప్పుడు యూజర్లను ఎక్కువగా వేధించే సమస్య యాడ్స్. ఈ యాడ్స్ తప్పించుకోవాలంటే ప్రీమియం వర్షన్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే యాడ్స్ తొలగించడానికి డబ్బులు పెట్టి గేమ్స్ కొనాలి. కొన్ని గేమ్స్‌కి వందల రూపాయలు ఖర్చు చేయాలి. టైంపాస్ కోసం ఆడే గేమ్స్‌కి వందల రూపాయలు ఖర్చు చేయడం వృథా ఖర్చే. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే వీడియో గేమ్స్ ఆడేప్పుడు ఇక యాడ్స్ అస్సలు డిస్టర్బ్ చేయవు. గేమ్స్ ఆడేప్పుడు యాడ్స్ రావడానికి కారణం ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండటమే. ఇంటర్నెట్ ఆపేసి గేమ్స్ ఆడితే యాడ్స్ అస్సలు కనిపించవు. అయితే గేమ్స్ ఆడటానికి ఇంటర్నెట్ ఆపేస్తే ఇతర ముఖ్యమైన నోటిఫికేషన్స్ కూడా రావు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గేమ్స్ ఆడేప్పుడు మీకు ఇంటర్నెట్ అవసరం లేదంటే మొబైల్ డేటా, వైఫై కనెక్షన్స్ ఆపేసి గేమ్స్ ఆడొచ్చు. ఇంటర్నెట్ ఆపినా కొన్ని గేమ్స్‌లో యాడ్స్ కనిపిస్తుంటాయి. చాలా తక్కువ గేమ్స్‌లో మాత్రమే ఈ సమస్య ఉంటుంది. కాబట్టి యాడ్స్‌ని తప్పించుకోలేరు. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కువగా బ్యానర్ యాడ్స్, వీడియో యాడ్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి. అందుకే మొబైల్ డేటా, వైఫై కనెక్షన్స్ ఆపి గేమ్స్ ఆడటం మేలు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు ఒక యాప్ ఇంటర్నెట్కి కనెక్ట్ కాకుండా కూడా ఆపొచ్చు. వీడియో గేమ్ యాప్స్‌కి ఈ ఫీచర్ ఉపయోగించొచ్చు. ఇందుకోసం యాప్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాప్ ఇన్ఫో కోసం ఐ బటన్ క్లిక్ చేయాలి. అందులో Restrict Data Usage ఆప్షన్ ఉంటుంది. వేర్వేరు ఫోన్లల్లో ఈ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉండొచ్చు. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మొబైల్ డేటా, వైఫై కనెక్షన్ ఆపేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)