1. గూగుల్ తన సెర్చ్, అసిస్టెంట్‌తో సహా అన్ని అప్లికేషన్లకు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్లాస్రూమ్ (Google Classroom) యాప్‌లో కూడా సరికొత్త ఫీచర్లు అందించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు గూగుల్ క్లాస్‌రూమ్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఇబ్బంది పడే విద్యార్థుల కోసం ఆండ్రాయిడ్‌లో మల్టీ-పేజీ స్కానర్, ఆఫ్‌లైన్ మోడ్‌ను గూగుల్ పరిచయం చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
2. ఇప్పుడు గూగుల్ క్లాస్రూమ్ ఆఫ్‌లైన్ అసైన్మెంట్ ఎడిటింగ్, ఇంప్రూవ్డ్ కెమెరా స్కానింగ్ టూల్ లకు మద్దతు ఇస్తుంది. గూగుల్ క్లాస్రూమ్ యాప్ అనేది పాఠశాలల కోసం గూగుల్ అభివృద్ధి చేసిన ఉచిత బ్లెండెడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఇది అసైన్మెంట్లను సృష్టించడం, డిస్ట్రిబ్యూట్, గ్రేడింగ్ చేయడం సులభతరం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫీచర్లు తొలత మొబైల్, పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న విద్యార్థులకు క్లాస్రూమ్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, నెక్స్ట్ బిలియన్ యూజర్స్ (NBU) దేశాల్లోని విద్యార్థులకు ఈ ఫీచర్స్ ఎంతగానో సహాయపడతాయి. విద్యార్థులు తమ ఆండ్రాయిడ్ డివైజ్ లో నెట్ కనెక్షన్ లేనప్పుడు ఆఫ్‌లైన్ వ్యూయింగ్, ఎడిటింగ్ కోసం గూగుల్ క్లాస్రూమ్ అసైన్మెంట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త ఫీచర్స్ వీలు కల్పిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్థులు పాఠశాల నుంచి బయలుదేరే ముందు అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేసుకుని.. ఇంటి వద్దే యాక్సెస్ చేసుకోవచ్చు. అసైన్మెంట్లను సబ్ మిట్, డౌన్లోడ్ చేయడం లేదా ప్రశ్నలను అడగడం, సమాధానాలు పొందడం వంటి వాటికి ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అయినప్పటికీ.. ఆఫ్‌లైన్ మోడ్ సాయంతో విద్యార్థులు ఎక్కడికైనా స్కూల్ వర్క్ ని తమతోపాటు తీసుకెళ్లవచ్చు. తద్వారా మారుమూల ప్రాంతాల్లోనైనా స్కూల్ వర్క్ యాక్సెస్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)(image: Lenovo India)
5. స్కానర్ సాయంతో ఫొటోలు తీయడం, రాసిన హోంవర్క్‌ను సబ్ మిట్ చేయడం వంటివి చేయవచ్చు. స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ కోసం పలు చిత్రాలను ఒకే ఫైల్‌గా కంబైన్ చేస్తుంది. యాప్‌లోని అప్లోడ్ సెట్టింగ్ ఇప్పుడు ఒకే దశలో అనేక విభిన్న రకాల ఫైల్‌లను సులభంగా సెలెక్ట్ చేసుకోవడానికి, సబ్ మిట్ చేయడానికి అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆండ్రాయిడ్ యాప్‌ని ఉపయోగించే ఉపాధ్యాయులు ఇప్పుడు విద్యార్థులు, అసైన్మెంట్ల మధ్య ఈజీగా స్వైప్ చేయవచ్చు.. అలాగే గ్రేడ్లను జోడించవచ్చు. అసైన్‌మెంట్‌లో అనేక ఫైల్లు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత ఫైల్లపై కామెంట్స్ ఎనేబుల్ చేయడం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు అభిప్రాయాన్ని తెలియజేయగలరు. వారు ఫైల్‌పై కామెంట్లు పెట్టొచ్చు లేదా విద్యార్థుల కోసం మరింత టార్గెటెడ్ ఫీడ్‌బ్యాక్‌ను గుర్తించే ఇంప్రూమెంట్ ఏరియాస్ అందించడానికి నిర్దిష్ట భాగాలను హైలైట్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా విద్యార్థులపై ఈ ప్రభావం పడుతోందని యునిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించేందుకు ఇండియన్ టీచర్లు కూడా కృషి చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల సేఫ్టీపై శ్రద్ధ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8.కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడం వల్ల ఇప్పట్లో పాఠశాలలు తెరిచే సూచనలు కనిపించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇంకొంతకాలం ఆన్లైన్ తరగతులు తప్పేట్టు లేదు. అయితే ఆన్లైన్లో పాఠాలు నేర్చుకునే పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)