అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు స్పెషల్ ఎలక్ట్రానిక్స్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా, జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఇతర డీల్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆఫర్లలో సొంతం చేసుకోగల రూ.25 వేల రేంజ్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.
* Realme 9 Pro+ 5G : ప్రస్తుతం కొనసాగుతున్న సేల్‌లో రియల్ మీ 9 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ అరోరా గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, సన్‌రైజ్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుంది. ఇది 4,500mAh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది.
* Motorola Edge 30 : మోటరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.5,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డివైజ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,999కి సొంతం చేసుకోవచ్చు.
* Xiaomi 11i Hypercharge 5G : షియోమి 11i హైపర్‌ఛార్జ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.23,249కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుకవైపు 108MP కెమెరా, 8MP, 2MP సెన్సార్లు ఉన్నాయి. 13 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని షియోమి కంపెనీ తెలిపింది.
* Vivo T1 Pro 5G : వివో T1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4,700mAh బ్యాటరీ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 8MP, 2MP సెన్సార్లతో 64MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ డివైజ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు.