1. రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. కానీ ప్రీమియం టెక్ బ్రాండ్ అయిన యాపిల్ (Apple) కారణంగా ఓ వ్యక్తి సరైన సమయంలో డాక్టర్ దగ్గరకు వెళ్లి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. హర్యానాకు చెందిన అతని పేరు నితేష్ చోప్రా. వయస్సు 33 ఏళ్లు. అతనో డెంటిస్ట్. తన భార్యకు యాపిల్ వాచ్ (Apple Watch) కొనిచ్చాడు. (ప్రతీకాత్మక చిత్రం)
2. నితేష్కు కొంతకాలంగా నీరసంగా ఉంటోంది. తన భార్య వాడుతున్న యాపిల్ వాచ్ 6 సిరీస్లో హెల్త్ స్టాట్స్ తెలుసుకోవచ్చని తెలుసు. యాపిల్ వాచ్లో ఈసీజీ ఫీచర్ కూడా ఉంది. తన భార్య యాపిల్ వాచ్ నుంచి ఓసారి ఈసీజీ చెక్ చేశాడు. ఈసీజీలో కాస్త తేడా కనిపించింది. AfibAlert వచ్చింది. AfibAlert అంటే గుండె కొట్టుకునే తీరును పర్యవేక్షించే ఫీచర్. (ప్రతీకాత్మక చిత్రం)
3. రెండుమూడుసార్లు చెక్ చేసినా రీడింగ్ ఒకేలా వచ్చింది. ప్రతీసారి AfibAlert రావడంతో నితేష్ వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ వెంటనే ఈసీజీ చేశారు. ఈసీజీలో కాస్త తేడా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చి మరిన్ని పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో సీసీయూలో ఉన్నప్పుడు మానిటర్లో కనిపించిన రీడింగ్, యాపిల్ వాచ్లో వచ్చిన రీడింగ్ ఒకేలా ఉన్నాయని నితేష్ చెప్పడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. అదే రోజు నితేష్కు యాంజియోగ్రఫీ కూడా చేశారు. ప్రధాన హృదయ ధమని పూర్తిగా బ్లాక్ అయిందని తేలింది. ఆ తర్వాత వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు ఇమెయిల్ ద్వారా తెలిపారు నితేష్ భార్య నేహా. యాపిల్ ప్రొడక్ట్ తన భర్త ప్రాణాన్ని కాపాడిందని వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. యాపిల్ అందించిన టెక్నాలజీ కారణంగానే సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్లగలిగామని, ఇప్పుడు తన భర్త ఆరోగ్యంగా ఉన్నారని టిమ్ కుక్కు ధన్యవాదాలు తెలిపారు. తాను యాపిల్ వాచ్ను ఫ్యాషన్ యాక్సెసరీగా భావించానని, సమయం చూడటానికి, స్టెప్ కౌంట్ కోసం పనిచేస్తుందని అనుకున్నానని, కానీ యాపిల్ వాచ్ తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదన్నారు నితేష్. (ప్రతీకాత్మక చిత్రం)
7. యాపిల్ వాచ్ 7 సిరీస్ వాచ్లల్లో ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉండటం విశేషం. ఇందులో 18 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. యాపిల్ వాచ్ 7 సిరీస్ కన్నా 33 శాతం వేగంగా ఛార్జ్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP6X సర్టిఫికేషన్ కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)