ఈ రెండు సంస్థల మధ్య గతేడాది ఆగస్ట్ 13 న ఈ సాగా ప్రారంభమైంది. iOS మరియు Android పరికరాల్లో ఫోర్ట్నైట్కు నవీకరణను ప్రవేశపెట్టినప్పుడు అసలు వివాదం మొదలైంది. మీరు యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ, ఆపిల్ మరియు గూగుల్ 30% లావాదేవీల రుసుమును వసూలు చేస్తాయి. అయితే, ఎపిక్ నేరు చెల్లించే మార్గాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ లావాదేవీలను సమర్ధవంతగా దాటవేసింది. దీంతో ఆగస్ట్ 13 న ఆపిల్ వెంటనే తమ స్టోర్ నుండి ఫోర్ట్ నైట్ ను తొలగించింది.
ఆపిల్ స్పందన తర్వాత వెంటనే.. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆటను తొలగించింది గూగుల్. ఇది ఆపిల్ నుంచి వచ్చిన ఆశ్చర్యకరమైన నిర్ణయం ఏమి కాదు. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటల నుంచి ఆపిల్ తమ ఆదాయ వనరులను తీసుకోవడం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, యాప్ స్టోర్ నుంచి ఫోర్ట్ నైట్ ను తొలగించినందుకు ఎపిక్ త్వరగానే స్పందించింది. ఆపిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దావా వేసింది ఎపిక్.
అయితే, ఈ దావాపై ఆగస్ట్ చివరలో ఒక న్యాయమూర్తి ఆపిల్ కు అనుకూలంగా తీర్పునిచ్చారు. కానీ, ఇది తాత్కాలికంగా మాత్రమే. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ ఆపిల్ వైపు ఉన్నారు. ఫోర్ట్‌నైట్ ను యాప్ స్టోర్‌కు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఇరు సంస్థల దావా పరంపర కొనసాగుతూనే ఉంది.