1. యాపిల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలో యాపిల్ నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. మార్చి 8న ఐఫోన్ ఎస్ఈ 2022 లేదా ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3) మోడల్ లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి. యాపిల్ అనలిస్ట్, బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ సమాచారం ప్రకారం యాపిల్ బడ్జెట్ ఐఫోన్ ధర 200 డాలర్ల లోపే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే యాపిల్ ఐఫోన్ ధర సుమారు రూ.15,000 బడ్జెట్లో రానుంది. తన వీక్లీ న్యూస్‌లెటర్ అయిన పవర్ఆన్లో ఈ వివరాలను వెల్లడించారు మార్క్ గుర్మాన్. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌కు బాగా పట్టున్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో సరసమైన ధరకే ఐఫోన్ రిలీజ్ చేయాలని యాపిల్ భావిస్తున్నట్టు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మరోవైపు యాపిల్ చైనా నుంచి ఇండియాకు తయారీ ప్లాంట్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 2016 లో ఐఫోన్ ఎస్ఈ మోడల్ వచ్చింది. అప్పుడు కేవలం 399 డాలర్లు అంటే రూ.30,200 ధరలో ఐఫోన్ రిలీజైంది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2020 ధర కూడా దాదాపు అదే రేంజ్లో ఉంది. త్వరలో ఐఫోన్ ఎస్ఈ 2022 లేదా ఐఫోన్ ఎస్ఈ 3 రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఫోన్ ఎస్ఈ 2022 లేదా ఐఫోన్ ఎస్ఈ 3 ధర సుమారు 300 డాలర్లు ఉండొచ్చని మరో రిపోర్ట్ సారాంశం. ఆ లెక్కన చూసినా రూ.22,500 బడ్జెట్లో ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ మోడల్ ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ ఫోన్ ధర 300 డాలర్లు ఉన్నా ప్రస్తుతం మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు కూడా దాదాపు అవే ధరలో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ మోడల్ 200 డాలర్లతో రిలీజ్ అయితే మిగతా ఐఫోన్ల లాగానే ఇండియన్ మార్కెట్లోకి కాస్త ఎక్కువ ధరతో రిలీజ్ అవుతుంది. ఆలెక్కన చూసినా ఐఫోన్ ఎస్ఈ కొత్త మోడల్ రూ.20,000 ధరకు కాస్త అటూ ఇటుగా ఉండే అవకాశాలున్నాయి. యాపిల్ ఇకోసిస్టమ్‌లోకి వెళ్లాలనుకునేవారికి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)