1. మార్కెట్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం 2026 నాటికి ఫోల్డబుల్ డిస్ప్లేతో ప్రొడక్ట్‌లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్‌బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్‌ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్‌లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్‌గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్ ఎక్స్ఆర్ అమెజాన్, ఐఫోన్ ఎక్స్ఆర్ ఆఫర్, ఐఫోన్ ఎక్స్ఆర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఐఫోన్ ఎక్స్ఆర్ కెమెరా, ఐఫోన్ ఎక్స్ఆర్ ధర" width="1600" height="1600" /> 3. ఈ తరహా ప్రొడక్ట్‌లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. యాపిల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలో యాపిల్ నుంచి చవకైన రాబోతోంది. మార్చి 8న ఐఫోన్ ఎస్ఈ 2022 లేదా ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3) మోడల్ లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి. యాపిల్ అనలిస్ట్, బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ సమాచారం ప్రకారం యాపిల్ బడ్జెట్ ఐఫోన్ ధర 200 డాలర్ల లోపే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే యాపిల్ ఐఫోన్ ధర సుమారు రూ.15,000 బడ్జెట్లో రానుంది. తన వీక్లీ న్యూస్‌లెటర్ అయిన పవర్ఆన్లో ఈ వివరాలను వెల్లడించారు మార్క్ గుర్మాన్. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌కు బాగా పట్టున్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో సరసమైన ధరకే ఐఫోన్ రిలీజ్ చేయాలని యాపిల్ భావిస్తున్నట్టు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు యాపిల్ చైనా నుంచి ఇండియాకు తయారీ ప్లాంట్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 2016 లో ఐఫోన్ ఎస్ఈ మోడల్ వచ్చింది. అప్పుడు కేవలం 399 డాలర్లు అంటే రూ.30,200 ధరలో ఐఫోన్ రిలీజైంది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2020 ధర కూడా దాదాపు అదే రేంజ్లో ఉంది. త్వరలో ఐఫోన్ ఎస్ఈ 2022 లేదా ఐఫోన్ ఎస్ఈ 3 రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)