ఐఫోన్ SE (2022) స్పెసిఫికేషన్లు
ఐఫోన్ SE (2022) మొబైల్ 4.7 ఇంచుల రెటీనా హెచ్డీ డిస్ప్లేతో వస్తోంది. ఈ డిస్ప్లే 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 326 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఐఫోన్ SE (2022) ముందు, వెనుక అత్యంత దృఢమైన గ్లాస్‌ను పొందపరిచింది. ఐఫోన్ 13, 13 ప్రోలకు ఉన్న గ్లాస్ ప్రొటెక్షన్ ఈ కొత్త SE మొబైల్‌కు కూడా కల్పించినట్టు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్త ఐఫోన్ SE మొబైల్ ప్రాసెసర్ హైలెట్‌గా నిలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్ మొబైళ్లలో ఉండే ఏ15 బయోనిక్ చిప్ ఈ ఐఫోన్ SE (2022)లో ఉంటుంది. ఐఫోన్ 8 కంటే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ 1.8 రెట్లు వేగవంతంగా ఉంటుందని యాపిల్ పేర్కొంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ ఎస్ఈ (2022) వెనుక 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాటరీ ఫుల్ చార్జ్‌పై 15 గంటల వీడియో ప్లేబ్యాక్, 50 గంటల ఆడియో ప్లేబ్యాక్ వస్తుందని యాపిల్ పేర్కొంది. అలాగే ఐఫోన్ SE (2022) మొబైల్ 20 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ , క్యూఐ స్టాండర్డ్ బేస్డ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అయితే, దీని రిటైల్ బాక్స్‌లో చార్జర్ ఉండదు. దాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)