1. ప్రీమియం టెక్ బ్రాండ్ అయిన యాపిల్ నుంచి ఇటీవల మరో చీపెస్ట్ ఐఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (iPhone SE) సిరీస్‌లో తక్కువ ధరకే ఐఫోన్స్ రిలీజ్ చేస్తోంది యాపిల్. గతంలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్గా ఐఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022) రిలీజ్ చేసింది. (image: Apple India)
2. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ ఎస్ఈ లాగానే ఐఫోన్ ఎస్ఈ 2022 ఉండటం విశేషం. కానీ స్పెసిఫికేషన్స్‌లో మార్పులు ఉన్నాయి. కొత్త మోడల్ లేటెస్ట్ ఐఓఎస్ వర్షన్‌తో వస్తుంది. ఇందులో 5జీ సపోర్ట్ ఉంది. 5జీ సపోర్ట్ ఉన్న చీపెస్ట్ ఐఫోన్ ఇదే కావడం విశేషం. అంతేకాదు... ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో 5జీ సపోర్ట్ లభిస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉన్న చిప్సెట్ ఇందులో ఉంది. (image: Apple India)
4. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐఫోన్ 8 లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన మోడల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే ఫోన్‌తో పాటు యూఎస్బీ సీ టు లైటెనింగ్ కేబుల్ మాత్రమే లభిస్తుంది. పవర్ అడాప్టర్, ఇయర్ పాడ్స్ లభించవు. మిడ్నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Apple India)
5. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం, గ్లాస్ డిజైన్‌తో ఉండటం విశేషం. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 స్మార్ట్ఫోన్లలో ఉన్నట్టు ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ముందు, వెనుకవైపు టఫెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. (image: Apple India)
6. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ ఐడీ లేదు. టచ్ ఐడీ మాత్రమే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. పాత మోడల్ కన్నా బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుందని కంపెనీ చెబుతోంది. వైర్‌సెల్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. (image: Apple India)
7. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 12మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. స్మార్ట్ హెచ్డీఆర్, ఫోటోగ్రఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్, పోర్ట్రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం విశేషం. చాలావరకు ఫీచర్స్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్నట్టుగానే ఉన్నాయి. (image: Apple India)