యాపిల్ ఐఫోన్లకు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువత ఐఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా భావిస్తుంది. అందుకే, ప్రీమియం సెగ్మెంట్లో లభించే ఐఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అయితే, వీటి ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్. యాపిల్ నుంచి ఇటీవల విడుదలైన వనిల్లా ఐఫోన్ 13 మోడల్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీని అసలు ధర రూ. 79,900 ఉండగా.. అమెజాన్‌లో ఆఫర్ కింద కేవలం రూ. 53,300 వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఏకంగా రూ. 25 వేలకు పైగా తగ్గింపు పొందవచ్చు. ఎలాగంటే.. యాపిల్ సంస్థ దీన్ని రూ. 5 వేల డిస్కౌంట్‌పై రూ. 74,900 వద్ద సేల్ చేస్తుంది. అయితే, అమెజాన్‌లో అన్ని బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉపయోగించుకుంటే రూ. 20,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ అన్ని ఆఫర్లు కలుపుకుంటే యాపిల్ ఐఫోన్ 13 కేవలం రూ. 53,300 ధర వద్ద లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ గల అన్ని వెనిలా ఐఫోన్ 13 వేరియంట్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ని కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)