ఐఫోన్ వినియోగించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కొందరు అధిక ధరల కారణంగా వెనక్కి తగ్గుతుంటారు. అలాంటి వారికి ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల టాప్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా యాపిల్ ప్రొడక్ట్ ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ డీల్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యాపిల్ ఐఫోన్ 12 సిరీస్‌లో స్మాల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 12 మినీ. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో 2020లో లాంచ్ అయింది. కంపెనీ వెబ్సైట్లో ప్రస్తుతం ఇది రూ.59,900కు లిస్ట్ అయింది. అయితే ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్ ప్రకటించింది. కేవలం రూ.18,499కు ఐఫోన్ 12 మినీ సొంతం చేసుకోవచ్చు.
* ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే
ఐఫోన్ 12 మినీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.37,999 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక స్టోర్ కంటే ఇది రూ.21,901 తక్కువ. అయితే ఈ ఐఫోన్ 12 మినీపై మరిన్ని ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా దీనిపై రూ.17,500 డిస్కౌంట్‌ను అందిస్తోంది.
* 12MP డ్యూయల్ కెమెరా సెటప్
ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌తో పాటే 2020లో ఐఫోన్ 12 మినీ కూడా లాంచ్ అయింది. ఐఫోన్ 12 సిరీస్‌లో ఉన్న ఫీచర్స్ దాదాపు ఐఫోన్ 12 మినీలో ఉన్నాయి. ఇది 5.4-అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో లభిస్తుంది. ఈ మినీ స్మార్ట్ ఫోన్ A14 బయోనిక్ చిప్సెట్ ద్వారా బెస్ట్ రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* మిని మోడల్స్‌కు యాపిల్ గుడ్‌బై
ఐఫోన్ 12 సిరీస్‌లో ప్రవేశపెట్టిన మినీ మోడల్ ప్రయోగం అంతగా సక్సెస్ కాలేదు. ఐఫోన్ 12 మినీ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదని కంపెనీ పేర్కొంది. దీంతో ఇటీవల కొన్ని నెలల క్రితం లాంచ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్‌లో మినీ మోడల్‌ను యాపిల్ నిలిపివేసింది. (ప్రతీకాత్మక చిత్రం)