1. ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై (iPhone) అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్స్ ఉన్నీ కలిపి రూ.32,000 బడ్జెట్లో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మంచి ఆఫర్ పొందడానికి ఆఫర్లో ఉన్న బ్యాంకు కార్డుతో పేమెంట్ చేయడంతో పాటు మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐఫోన్ 11 ప్రస్తుత ధరలు చూస్తే 64జీబీ వేరియంట్ ధర రూ.49,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.54,900. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి రూ.17,800 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఐఫోన్ 11 బేస్ వేరియంట్‌ను రూ.32,100 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్లో రూ.17,800 డిస్కౌంట్ వర్తించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒకవేళ పాత మొబైల్‌కు అంతకన్నా తక్కువ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే మిగతా మొత్తం చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోవడానికి మోడల్ సెలెక్ట్ చేసి ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. సాధారణంగా రూ.14,800 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.3,000 డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌తో రూ.32,000 లోపే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌లో 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా కెపాసిటీ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్రైట్, అడ్వాన్స్డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పనోరమా, నైట్ మోడ్, ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బరస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను 6 కలర్స్‌లో కొనొచ్చు. వైట్, పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 మాత్రమే కాదు... ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 13 లాంటి మోడల్స్ పైనా ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)