ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ డివైజ్‌ల్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. అందుకు తగ్గట్టు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కొన్ని యాపిల్ డివైజ్‌లపై ధర బాగా తగ్గింది. వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై కంపెనీ రూ.10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై మాత్రమే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్లపై ఆఫర్లు
ఇప్పుడు యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తే రూ. 7,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 2022లో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఐఫోన్ 13 సిరీస్ మోడల్‌లపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
మ్యాక్‌బుక్-ఎయిర్ పాడ్స్
మ్యాక్‌బుక్ ఎయిర్ (M2, 2022 మోడల్), మ్యాక్‌బుక్ Pro (13-అంగుళాల) మోడల్స్‌పై యాపిల్ రూ.10,000 డిస్కౌంట్ ప్రకటించింది. సెకండ్ జనరేషన్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ హెచ్డీఎఫ్సీ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐప్యాడ్
ఇప్పుడు రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్10th Gen, ఐప్యాడ్ ప్రో 12.9-అంగుళాల మోడల్‌పై వరుసగా రూ.3,000, రూ.5,000 క్యాష్ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోళ్లపై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)